-రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం గా ఎంపీలకు బాబు దిశా నిర్దేశం
-తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఎంపీలందరూ హాజరయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను లోక్ సభలో లేవనెత్తాలన్నారు. ఈ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశాలను ఈ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తామని, కేంద్ర ప్రాయోజిత పథకాలను సాధ్యమైనంతగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
Prajavartha Online Telugu News