Breaking News

డోకిపర్రు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

-గుడ్లవల్లేరు మండలంలో పీ4 విధానంలో భాగస్వామ్యం కావాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం
-మండల పరిధిలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు అంగీకరించిన కృష్ణారెడ్డి

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ.వీ కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయం నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లో పేదరిక నిర్మూలనకు గురించి ప్రస్తావించాం. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం, దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. జమిలి విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలన్నీ ఒకసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పని చేయాల్సి ఉంటుంది.’ అని అన్నారు. పీ4 విధానంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు చొరవ తీసుకోవాలని కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించగా ఆయన అంగీకరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక వేత్తలు తోడ్పాటునందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *