Breaking News

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ యన్.టి.ఆర్ క్రీడా ప్రాంగణం నందు ఈ నేల 12 నుండి 15 వరకు సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. నగర ప్రజల కొరకు ఈ నెల 12 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ముగ్గుల పోటీలు (రంగోలి) మరియు మెహంది పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ నెల 13 వ తేదీ సోమవారం భోగి రోజున తాడులాగుట, లెమన్ స్పూన్ మరియు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే నగర పాలక సంస్థ సిబ్బందికి మరియు పాత్రికేయులకు క్రికెట్ మరియు షటిల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. కావున పోటీలలో పాల్గొనుటకు ఆసక్తి గలవారు వారి పేర్లను పూర్తి వివరాలతో శనివారం సాయంత్రం 7 గంటల నగర పాలక సంస్థ యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం నందు రిజిస్టర్ చేసుకోవాలని, అందుకు ప్రత్యేక కౌంటర్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు. పోటీలలో రిజిస్టర్ నమోదులో ఏమైనా సందేహాలున్నా క్రీడాప్రాంగణ ఇంచార్జ్ శ్రీనివాస్ – 9492871972, మణికంఠ – 9642983416 ల యందు సంప్రదించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *