Breaking News

విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (FMGలు) పై జరిగిన నిరసన దృష్ట్యా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ -19 మహమ్మారి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తమ M.B.B.S కోర్సులో కొంత బాగాన్ని ఆన్ లైన్ లో పూర్తి చేసిన విదేశీ వైద్య విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (P. R) మంజూరు చేయాలని ఏ.పి మెడికల్ కౌన్సిల్ (APMC)ని అభ్యర్థించారు. చాలా మంది విదేశీ వైద్య విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చి ఆన్‌లైన్‌లో తమ వైద్య విధ్యను కొనసాగించిన తరువాత ఆఫ్‌లైన్ మోడ్‌లో కోర్సు యొక్క మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి వారి వారి విదేశీ విశ్వవిద్యాలయాలకు తిరిగి వెళ్ళారు.
దీనికి ప్రతిస్పందనగా, జాతీయ వైద్య కమిషన్ (NMC) నవంబర్ 22, 2023న మార్గదర్శకాలను జారీ చేసియున్నది. దీని ప్రకారము వారి చివరి సంవత్సరం ఆన్‌లైన్‌లో చదివిన విదేశీ వైద్య విద్యార్థులు రెండు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ ( అనగా, ఒక సంవత్సరం క్లినికల్ క్లర్క్‌షిప్ మరియు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్) చేయవలసి ఉంటుంది. చివరి మరియు చివరి ముందు సంవత్సరాల్లో ఆన్‌లైన్‌లో చదివిన వారు మూడు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ (అనగా, రెండు సంవత్సరాల క్లినికల్ క్లర్క్‌షిప్ మరియు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్) పూర్తి చేయవలసి ఉంటుంది.
ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ కొనసాగిస్తున్న కొంతమంది విదేశీ వైద్య విద్యార్థులు ఈ సూచనలను పాటించడానికి నిరాకరించుచూ వారు అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయాల నుండి పొందిన కాంపెన్సేటరీ లేఖలను అంగీకరించమని అభ్యర్థిస్తూ ప్రతిపాదనలను సమర్పించారు. అయితే, ఆన్‌లైన్ అధ్యయనాలకు తగిన కంపెన్సేటరీ ఆఫ్ లైన్ విధ్యా కాలము ధృవీకరించడానికి అవసరమైన వివరాలను లేఖలలో పేర్కొనలేదని మరియు అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్‌లను జారీ చేయాలనే వారి అభ్యర్థనను APMC పరిగణించదని NMC స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ FMGలు తమ కౌన్సెలింగ్ సమయంలో ఒక అండర్‌టేకింగ్ లెటర్‌ను కూడా సమర్పించారు, దానిలో వారి ఇంటర్న్‌షిప్ కాలంలో NMC జారీ చేసిన భవిష్యత్తు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ అధ్యయనానికి దీటుగా ఆఫ్ లైన్ విద్య పూర్తి చేయనటువంటి , మరియు అదనపు సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ను చేయడానికి నిరాకరిస్తున్న వారి శాశ్వత రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడం జరిగినది . ఈ కేటగిరీలకు సంబంధించి 25 మంది FMGల బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసియున్నది, ఈకేసు హైకోర్ట్ నందు పెండింగ్ లో ఉన్నది. .
జాతీయ వైద్య కమిషన్ (NMC) నవంబర్ 19, 2024న మార్గదర్శకాలను జారీ చేసింది, శాశ్వత రిజిస్ట్రేషన్లు (PR) మంజూరు చేసే ముందు రాష్ట్ర వైద్య మండలులు సంబంధిత భారత రాయబార కార్యాలయం ద్వారా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల (FMGs) డిగ్రీలను ధృవీకరించాలని ఆదేశించింది. ప్రస్తుతం, సంబంధిత భారత రాయబార కార్యాలయాల నుండి నిర్ధారణ పొందిన తర్వాత NMC మార్గదర్శకాలను పాటించిన అర్హత కలిగిన FMGలకు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) శాశ్వత రిజిస్ట్రేషన్లు (PR) లను జారీ చేస్తోంది.

ఈ మార్గదర్శకాల అమలుపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి రిజిస్ట్రార్‌కు లేదు. కౌన్సిల్ జనరల్ బాడీ ప్రకారం ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ సమస్యలకు సంబంధించి APMC మరియు NMC మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. APMC ఎప్పటికప్పుడు జారీ చేసిన NMC మార్గదర్శకాలను శ్రద్ధగా అమలు చేస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వాసన్య మహిళా మండలి విజ‌య‌వాడ

-“అహింసావాది మహాత్మాగాంధి ” విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ స్మృతి దినం సందర్భంలో నాస్తికకేంద్రంలోని బాపూదర్శన్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *