Breaking News

ఎన్టీఆర్ జిల్లాలో 2ల‌క్ష‌ల ఇళ్ల‌కు సూర్యఘ‌ర్ క‌నెక్ష‌న్స్ అందించ‌ట‌మే ధ్యేయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం పై పటమట సెంటర్ లో అవగాహన ర్యాలీ
-ర్యాలీ లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర,
-ఎన్టీఆర్ జిల్లాలోని ప్ర‌తి ఇంట్లో సౌర‌ వెలుగులు నిండాలి
-ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మేలు చేసే ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్
-విద్యుత్‌ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం..
-పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలి యోజ‌న పథకాన్ని ప్ర‌జ‌లంద‌రూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యఘర్‌ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలి. సోలార్‌ ప్యానెల్‌ కనెక్షన్‌ల కొరకు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు ముందుగా జిల్లా అధికారులు, ఎన్డీయే కూట‌మి నాయ‌కులు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపి కేశినేని శివనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ తో క‌లిసి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో 2ల‌క్ష‌ల ఇళ్ల‌కు సూర్యఘ‌ర్ క‌నెక్ష‌న్స్ అందించ‌ట‌మే ధ్యేయంగా పెట్టుకున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.

సూర్యఘర్‌ పథకం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ లు పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ నుండి ప్రారంభించి గురునానక్‌ కాలనీ వరకు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురునానక్‌ నగర్‌లో సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్‌ను అమర్చుకున్న మన్న నాగ భాస్కరాంబ గృహనికి వెళ్ళి ఇంటి పై కప్పుపై సోలార్‌ ప్యానెల్‌ను పరిశీలించారు. సోలార్‌ ప్యానెల్‌ ద్వారా విద్యుత్‌ తయారి వినియోగం వివరాలను అడిగి తెలసుకుని లబ్దిదారురాలు మన్న నాగ భాస్కరాంబను ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు.

ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్‌ చెల్లింపుల బారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్దిదారులు ఇంటి పై సోలార్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్‌ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లింపులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. తద్వారా ఎంతో ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతారన్నారు. లబ్దిదారులు రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్‌ ప్యానెల్‌ను రూ. 78 వేల ప్రభుత్వ రాయితీతో ఇంటి కప్పుపై ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందన్నారు. రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్‌ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. దాదాపు 20 ఏళ్లపాటు ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందొచ్చని వివరించారు. 3 కేవీ వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని.. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చునని ఎంపి కేశినేని శివనాథ్‌ తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ సూర్యఘర్‌ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్ళకు సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్‌ను అమర్చి జిల్లాను అగ్ర గామిగా నిలపాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 1లక్ష మందికి పైగా లబ్దిదారులకు బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు సుమారు 800 మంది లబ్దిదారులు రుణాల కొరకు ధరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఇందులో 700 మందికి పైగా లబ్దిదారులు 10 శాతం భాగస్వామ్యాన్ని చెల్లించడం జరిగిందన్నారు. బ్యాంకు నుండి రుణం పొందిన లబ్దిదారులు సూర్యఘర్‌ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకుని ప్రతి నెల సాదరణ విద్యుత్‌ బిల్లు చెల్లించడం ద్వారా ఆదా అయ్యే సొమ్మును బ్యాంక్‌ రుణం కింద చెల్లిస్తే రుణం తీరుతుందన్నారు. లబ్దిదారులు ఇంటి కప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకుని ప్రజలకు కరెంట్‌ బిల్లుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్దిదారులు సూర్యఘర్‌ పథకం కింద రుణం కొరకు ధరఖాస్తు చేసుకుంటే కాలయాపన చేయకుండా స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి తక్షణమే రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది లబ్దిదారులు ప్యానెల్‌ను పొందేందుకు పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్దఎత్తున రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారన్నారు. ప్రజలు సౌర శక్తి విద్యుత్‌ను వినియోగించుకోవడం ద్వారా కాలుష్య రహిత పర్యావరణ హిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ లక్ష్మీశ పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్‌ కమీషనర్‌ హెచ్‌యం ధ్యాన చంద్ర, ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా, టిడిపి రాష్ట్ర నాయ‌కులు చెన్నుపాటి గాంధీ, బొప్ప‌న భ‌వ‌కుమార్, రాష్ట్ర తెలుగు మ‌హిళ ఉపాధ్య‌క్షురాలు ఆషా, కార్పోరేటర్‌ చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని వెంకటప్రసాద్‌, టిడిపి యువ‌నాయ‌కుడు గద్దె క్రాంతి కుమార్‌, అదనపు కమీషనర్‌ డా. డి. చంద్రశేఖర్‌ పివోయుసిడి పి. వెంకటనారాయణ, జోనల్‌ కమీషనర్‌ ప్రభుదాస్‌, డీఆర్‌డీఏ పీడీ కె. శీనివాస్‌రావు, ట్రాన్స్‌ కో ఎస్‌ఇ ఎ. మురళిమోహన్ ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *