-ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి హాజరు
-చైర్మన్ రుద్ర కోటి , డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎపి నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆ సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రుద్రకోటి సదాశివం ,డైరెక్టర్ సురవరపు నాగరాజు లకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఎంపి కేశినేని శివనాథ్ వారిని శాలువాతో సత్కరించారు. అలాగే డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామిక వేత్త టిటిడి బోర్డ్ మెంబర్ శాంతరామ్ ను కూడా ఎంపి కేశినేని శివనాథ్ సత్కరించారు.
అనంతరం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఎంపి కేశినేని శివనాథ్ ను శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నాయిబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్దికి అండగా వుంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు గన్నే ప్రసాద్, ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్చూరి ప్రసాద్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.