Breaking News

ల‌య‌కారుడి క‌రుణా క‌టాక్ష వీక్ష‌ణాలు ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎమ్మెల్యే వసంత నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు
-స‌తీస‌మేతంగా హాజ‌రైన ఎంపికేశినేని శివ‌నాథ్

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆ ప‌ర‌మ‌శివుని ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై వుండ‌టంతోపాటు, రాష్ట్రం సుభిక్షంగా వుండేవిధంగా శివ‌పార్వ‌తుల అనుగ్ర‌హం వుండాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్ త‌న స్వ‌గ్రామం ఐత‌వ‌రంలోని వారి నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీతో క‌లిసి హాజ‌రైయ్యారు. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్- శిరీష దంప‌తుల‌తో క‌లిసి పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాజీ హోమ్ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావును క‌లిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *