Breaking News

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం కృషి చేసిన నాయకుడు కేశినేని వెంక‌య్య‌

-ఎంపి కార్యాల‌యంలో వెంక‌య్య వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం
-నివాళుల‌ర్పించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ , టిడిపి నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం, విజ‌య‌వాడలో తెలుగుదేశం పార్టీను బ‌లోపేతం చేసేందుకు విజ‌య‌వాడ న‌గ‌ర తెలుగుదేశం పార్టీ తొలి క‌న్వీన‌ర్ గా కేశినేని వెంక‌య్య ప‌దవీ కాంక్ష లేకుండా కృషి చేశార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. బుధ‌వారం కేశినేని వెంక‌య్య వ‌ర్దంతి కార్య‌క్ర‌మం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో నిర్వ‌హించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ముందుగా వెంక‌య్య చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం టిడిపి నాయ‌కులు వెంక‌య్య నివాళుల‌ర్పించారు.

అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ త‌న తాత వెంక‌య్య‌ విజ‌య‌వాడ అర్బ‌న్ తెలుగుదేశం పార్టీ ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ గా ప‌ని చేశార‌ని గుర్తు చేసుకున్నారు. టిడిపి అభివృద్ది కి పనిచేయటంతో పాటు నంద‌మూరి తార‌క రామారావు కి అండ‌దండ‌గా చేదోడు వాదోడుగా నిలిచాడ‌న్నారు. అలాగే ద‌ళితుల‌కు , పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా తెలుగుదేశం పార్టీ వుంటుంద‌నే న‌మ్మ‌కం క‌లిగించేందుకు త‌న ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశాడ‌న్నారు. వెంక‌య్య ఆశ‌యాల‌కు, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకుంటూ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కి కృషి చేస్తాన‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, టిడిపి ఎస్సీ సెల్ అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్‌, టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాదిగాని గురునాథం, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు న‌ర‌సింహ‌చౌద‌రి, విజ‌య‌వాడ అర్బ‌న్ ఎస్సీ సెల్ మాజీ అధ్య‌క్షుడు జి.వి.న‌ర‌సింహారావు, విజ‌య‌వాడ అర్బ‌న్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎమ్.డి ఇర్ఫాన్, టిడిపి నాయ‌కులు యెర్నెని వేద‌వ్యాస్, అబీద్ హుస్సెన్, డాక్ట‌ర్ సంకె విశ్వ‌నాథం, వేశ‌పోగు జాన్ భాస్క‌ర‌రావు ల‌తోపాటు టిడిపి నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *