Breaking News

అర్జీ లు పరిష్కారం దిశగా చర్యలు హేతుబద్ధత కలిగి ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సేవలు అందించే క్రమంలో రెవిన్యూ అధికారి విధుల నిర్వహణా సామర్ధ్యం పెంచడం ద్వారా మాత్రమే ప్రజల సంతృప్తి స్థాయి పెంచడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం రెవిన్యూ అధికారులు సమావేశంలో పిజిఆర్ఎస్, వాటర్ ట్యాక్స్ , ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూముల క్రమబద్ధీకరణ , పేదలందరికీ స్వంత ఇంటి స్థలాలు , ప్రభుత్వ భూముల గుర్తింపు, పౌర సేవలు పై డి ఆర్వో టి సీతారామ మూర్తి తో క్షేత్ర స్థాయి రెవిన్యూ అధికారుల పనితీరు సమీక్షించారు.

జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కార విధానంలో అధికారుల పనితీరుకు సంబంధించిన ఐ వి ఆర్ ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీ లు పరిష్కారం దిశగా చర్యలు హేతుబద్ధత కలిగి ఉండాలన్నారు. జిల్లా లో 626 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, వాటిలో కోరుకొండ లో 187 , గోపాలపురం లో 105 అర్జీలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్క రీ ఓపెన్ అయిన అర్జిల విషయంలో తహసిల్దార్ వ్యక్తిగత దృష్టి పెట్టడం, సంబంధింత గ్రామ రెవిన్యూ అధికారి నుంచి సమగ్ర నివేదిక ఆధారంగా అర్జీ దారులకు చెందిన పరిష్కార స్థాయి వివరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణి సుస్మిత, ఆర్ కృష్ణ నాయక్, కే ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి , తహసిల్దార్ లు, కలెక్టరేట్ అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్ , తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *