Breaking News

హజ్ యాత్రికులకు ఎలాంటి అంతరాయం లేకుండా టీకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయ, మరియు మైనారిటీస్ సంక్షేమ శాఖల మంత్రి ఎన్. ఎం. డి. ఫారూక్ ఆదేశాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులకు ఎలాంటి అంతరాయం లేకుండా టీకాలు వేసే విధంగా మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మరియు రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారిని, మెడికల్ అండ్ హెల్త్ శాఖను అభ్యర్థించడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించి, హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రారంభించబడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు, ఆయా జిల్లాల పరిపాలన అధికారులకు తగిన సూచనలు జారీ చేస్తారని తెలిపారు. టీకా వేసిన తరువాత శరీరంలో ప్రతిరక్షకాలు ఏర్పడేందుకు సరైన సమయం అవసరం అయినందువలన, హజ్ యాత్రికులు తమ యాత్ర తేదీకి కనీసం 15 రోజులు ముందు టీకా వేయించుకోవడం ఉత్తమం. సంబంధిత జిల్లాల హజ్ సొసైటీలు ఈ విషయాన్ని దృష్టియందుంచుకొని, తగిన ఏర్పాట్లు చేసుకొనవలసినదిగా విజ్ఞప్తి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *