Breaking News

యోగా ఆక్యుప్రెషర్, ఆయుర్వేదలతో అంతర పంచభూత అవయవాల పనితీరు సమస్థితి

-యోగశక్తి సాధనా సమితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనుషులలో వచ్చే సమస్యలు విరిగినవి,తెగినవి మరియు కుళ్ళినవి తప్ప మిగతా సమస్యలు ప్రాణ శక్తి తగ్గి,తత్వాలలో వచ్చే మార్పులు మరియు అంతర పంచభూత అవయవాల పనితీరు మార్పుల వల్ల వస్తున్నాయని యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు విజయవాడ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పటల్ ఆవరణలో సూపర్డెంట్ డాక్టర్ పి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడుతూ మానవులలో వచ్చే ఎక్కువ అనారోగ్యాలు అంతర పంచభూత అవయవాలలో వచ్చే మార్పులే కారణమని వాటిని నాడీ శోధనతో తెలుసుకొని,సమన్వయ పరచడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ఆయుర్వేదంలో పంచకర్మ,వనమూలికలు వాడతారని, యోగ ఆక్యుప్రెజర్ లో ఎలాంటి బాహ్య మందులు వాడరని,దేహంలోనే నిక్షిప్తమై ఉన్నా ప్రాణ శక్తిని పునః శక్తివంతం చేసి,ఆరోగ్యం పొందే లాగా చేస్తారని ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర ద్వారా పునః శక్తివంతం చేసేలాగా ఏర్పాటు చేసి భారత మరియు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను తగ్గించి న మహనీయుడు మన ప్రధాని మోడీ అని కొనయాడారు.ఇకముందు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా మోడీ ఫిట్నెస్ మంత్ర ప్రపంచమంతా ఉపయోగపడుతుందని,కావున అందరూ ప్రతి రోజు మోడీ ఫిట్నెస్ మంత్ర ఆచరించి అనారోగ్యం నుండి ఆరోగ్యం, ఆనందం మరియు పూర్ణాయిషు పొందవలసిందిగా కోరారు.హాస్పిటల్స్ సూపర్డెంట్ పి కృష్ణవేణి సభను ప్రారంభించి అందరికీ మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందజేశారు.ఆస్పటల్ ఉద్యోగులు చికిత్స కొరకు వచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *