Breaking News

బాపులపాడు మండలంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన

-కొయ్యూరు గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్ల ప్రారంభం
-బాపులపాడు జెడ్.పి హైస్కూల్ వద్ద రూ.28 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డు ప్రారంభం
-వచ్చే రెండు నెలల్లో కొయ్యూరులో కొత్త రోడ్డు పనులకు రూ.75 లక్షలు కేటాయిస్తామని హామీ
-సాయంత్రం 6 గంటల తర్వాత మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : ఎమ్మెల్యే హెచ్చరిక
-గత పాలకుల అక్రమ తవ్వకాల వల్ల 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
-బాపులపాడులో ‘ప్రజా దర్బార్’.. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
-ప్రభుత్వ భూముల ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం బాపులపాడు మండలంలో పర్యటించిన ఆయన కొయ్యూరు గ్రామంలో సుమారు రూ.58 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్.సి.ఎం టవర్ నుండి ఎస్సీ కాలనీ వరకు సి.సి రోడ్డు, కొయ్యూరు గ్రామం నుండి ఎమ్.ఎన్.కే రోడ్డు వరకు నిర్మించిన రోడ్లతో పాటు గ్రామంలోని అంతర్గత సి.సి రోడ్లను ప్రారంభించారు. అనంతరం బాపులపాడు గ్రామంలోని జెడ్.పి హైస్కూల్ వెనుక రూ.28 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిధుల కేటాయింపులో వెనుకబడిన కొయ్యూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించి గడువు ముగిసిపోతున్న రూ.50 లక్షల నిధులను మంజూరు చేయించి ఎస్సీ కాలనీ రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ఎన్.ఆర్.జి.ఎస్ కింద మరో రూ.75 లక్షలతో కొత్త రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రెమల్లె, మల్లవల్లి సహా అన్ని గ్రామాల్లో ఎస్సీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా ఇళ్ల స్థలాలు మెరక చేసుకోవడానికి, రైతుల పొలాలకు అవసరమైన మట్టిని ఉచితంగా అందిస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మట్టి తవ్వకాలు జరపాలని, సాయంత్రం 6 గంటల తర్వాత మైనింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మట్టిని బయట వ్యక్తులకు తరలించరాదని స్పష్టం చేశారు. త్వరలో కొయ్యూరు గ్రామానికి కూడా అనుమతులు మంజూరు చేసి గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు, రైతుల పొలాలకు మట్టి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పదేళ్లలో నియోజకవర్గంలో దేవాలయాలు, పాఠశాలలు, చర్చిలు, స్మశానవాటికలు సహా అనేక ప్రాంతాలు పల్లమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో అక్రమ తవ్వకాల వల్ల కొన్ని గ్రామాల్లో చెరువుల్లో ప్రమాదవశాత్తు పడి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు బాధాకరమన్నారు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మట్టి తవ్వకాలు జరగాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే బూత్ లెవెల్ ఏజెంట్లకు గుర్తింపునిస్తూ వారితోనే రోడ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. రాబోయే ఆరు నుంచి ఏడు నెలల్లో మరిన్ని నిధులతో తిరిగి గ్రామానికి వచ్చి కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాపులపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు ప్రజల అర్జీలు స్వయంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల ఎంపీడీవో జోగేశ్వరరావు, ఎమ్మార్వో బండ్రెడ్డి మురళీకృష్ణ, జనసేన పార్టీ సమన్వయ కర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, కొయ్యూరు గ్రామ టిడిపి అధ్యక్షులు తూమాటి సాంబశివరావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పురి సాయి కళ్యాణి, పుట్టా సురేష్, వేములపల్లి శ్రీనివాసరావు, కొల్లి లక్ష్మీ నారాయణ, కొల్లి వీర వెంకట సత్యనారాయణ, కాండ్రు అజయ్, చిన్నాల లక్ష్మీనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, వెలగా రాంబాబు, మూల్పురి ధన కోటేశ్వరరావు, వెలగా సుబ్బారావు, తూమాటి శివరామకృష్ణ, కాటూరి విజయభాస్కర్, కొల్లూరు చంద్రకాంత్, కొల్లి చందు తదితరులు పాల్గొన్నారు..బాపులపాడు మండల ఎంపీడీవో జోగేశ్వరరావు, ఎమ్మార్వో బండ్రెడ్డి మురళీకృష్ణ, జనసేన పార్టీ సమన్వయ కర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, బాపులపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు, కొయ్యూరు గ్రామ టిడిపి అధ్యక్షులు తూమాటి సాంబశివరావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మూల్పురి సాయి కళ్యాణి, గొడ్డళ్ల చిన్న రామారావు, పుట్టా సురేష్, వేములపల్లి శ్రీనివాసరావు, వేగిరెడ్డి పాపారావు, కొల్లి లక్ష్మీ నారాయణ, కాండ్రు అజయ్, కొల్లి వీర వెంకట సత్యనారాయణ, చిన్నాల లక్ష్మీనారాయణ, గార్లపాటి రాజేశ్వరరావు, మొవ్వ వేణుగోపాల్, కర్రా ప్రసాద్ పాల్, తడిశెట్టి శ్రీను, చింతల వెంకట అప్పారావు, షేక్ సత్తార్, దుట్టా శ్రీమన్నారాయణ, కడవకొల్లు రాజేష్, కలపాల నాని,తుమ్మల బ్రహ్మం, కొమ్మారెడ్డి రాజేష్, రాజులపాటి నాగరాజు, పొట్లూరి ఫణి, వెలగ రాంబాబు, మూల్పురి ధన కోటేశ్వరరావు, వెలగా సుబ్బారావు, తూమాటి శివరామకృష్ణ, కాటూరి విజయభాస్కర్, కొల్లూరు చంద్రకాంత్, కొల్లి చందు, వల్లూరిపల్లి నాని, కొండేటి నాగరాజు, కాకుమాను వెంకటేశ్వరరావు,అక్కినేని రవి, కోరం రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *