విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు ప్రజల నుంచి 141 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీ దారు కు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
141 అర్జీలలో నేరుగా 81, ఆన్లైన్లో 60 అర్జీలు వచ్చాయని చెప్పారు.
పోలీసు శాఖకు అత్యధికంగా 33 అర్జీలు అందాయని చెప్పారు. రెవిన్యూ శాఖకు 20, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 26, పంచాయతీరాజ్ శాఖకు 18 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
విభిన్న ప్రతిభావంతులు 5, పౌరసరఫరాల శాఖకు 4, డిఆర్డిఏ 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ 4, ఆర్ డబ్ల్యు ఎస్ 4, ఏపీ సీపీడీసీఎల్ 3, మైన్స్ 3, ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ 2, కలెక్టరేట్ 2, హౌసింగ్ 2, కార్మిక 2, ఏపీపీఎస్సీ, ఎల్ డి ఎం, ఎస్ జి ఎస్ డబ్ల్యూ, టెక్నికల్ ఎడ్యుకేషన్, రవాణా
శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డిఆర్ఓ ఎం.లక్ష్మీ నరసింహం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News