విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఈ రోజు ఎల్ నినో (El Niño) పుస్తకమును ఘనంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి (DAO), జిల్లా ఉద్యానవన అధికారి (DHO), వ్యవసాయ సంయుక్త సంచాలకులు (JDA), పశుసంవర్ధక శాఖ మరియు సాగునీటి శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఎల్ నినో పుస్తకం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్ నినో కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలు మరియు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించబడింది. వాతావరణ మార్పులకు అనుకూలంగా విత్తన గుళికలు చేసి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ప్రధాన పంటగా వేసుకోవాలి (PMDS ) సూచించడం జరిగింది. జిల్లాలోని రైతులు ఈ పుస్తకం లోని సూచనలను పాటించడం ద్వారా పంటల నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన వ్యవసాయాన్ని సాధించగలరని అధికారులు సూచించారు.
Prajavartha Online Telugu News