Breaking News

బాధిత కుటుంబాలకి ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య అవసరాల కోసం పేదలకు ఆర్థిక సహాయం అందించే ఎల్ ఓ సీ పత్రాలను నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ సహాయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు ఆయా డివిజన్ల పరిధిలోని కూటమినేతలతో కలిసి అందజేసి, వారికి అండగా ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు.

34 వ డివిజన్ , ఖుద్దూస్ నగర్ చెందిన బీ చైతన్య కుమార్ (35) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు , అతనికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 1 లక్ష 74 వేల ఎల్ ఓ సీ ను బీజేపీ సీనియర్ నాయకులు కే రామకృష్ణ, 38 వ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ విస్సంశెట్టి శ్రీనివాసరావు తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. అదేవిధంగా 52 వ డివిజన్ కోమల విలాస్ ప్రాంతానికి చెందిన గర్రె పద్మావతి 52 గర్భాశయ కణితి సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 2 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలను 52 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఈగల సాంబశివరావుతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు.

త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *