విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు 20-05-2026 న నిర్వహించబడనున్న దేశవ్యాప్త ఒకరోజు బంద్‌లో ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మరియు ది కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు.
జిల్లాలోని ముఖ్య కేంద్రాలలో గుర్తించిన మెడికల్ షాపులు, ఆసుపత్రులు, క్లినిక్స్ మరియు నర్సింగ్ హోమ్స్‌లోని మెడికల్ షాపులు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో పనిచేస్తున్న జనరిక్ మెడికల్ షాపులు, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న అన్ని మెడ్‌ప్లస్ స్టోర్లు బంద్ రోజు కూడా తెరిచి ఉండి ప్రజలకు మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
అలాగే, జిల్లా పరిధిలోని అన్ని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు తమ తమ పరిధిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మెడికల్ షాపుల నిర్వాహకులు, ఆసుపత్రి యాజమాన్యాలు మరియు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అత్యవసర మందుల అవసరాల కోసం ప్రత్యేక సంప్రదింపు నంబర్లు మరియు తెరిచి ఉండే మెడికల్ షాపుల జాబితా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News