Breaking News

ఈనెల 22న గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.22.05.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్  డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, హెటిరో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, కురాకు ఫైనాన్సియల్ సర్వీసెస్, యూనివర్సల్ ప్రింట్ సిస్టమ్స్, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్, వరుణ్ మోటార్స్ వంటి 10కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని, 730కు పైగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మే 22న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *