Breaking News

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ ను భారత్ ఎన్నికల సంఘం ప్రకటించినదని, వచ్చే జూన్ 15వ తేదీ నుండి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతారని ఆలోగా అందరూ బిఎల్ఎ లను నియమించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు

మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి సాంబార్లో ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టుటకు షెడ్యూల్ను ప్రకటించిన అన్నారు. ప్రకటించినది అన్నారు

ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చే జూన్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు సవరణ కార్యక్రమం పైన సన్నద్ధత, శిక్షణలు, ముద్రణలు జరుగుతాయన్నారు.
జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడతారన్నారు. ఓటరు నమోదు పత్రాలు అందజేస్తారన్నారు.
జులై 14 వ తేదీన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు.
జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు.
జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 20 వ తేది వరకు ఓటర్ల జాబితా పై క్లైములు గాని, అభ్యంతరాలు గాని స్వీకరించడం జరుగుతుందన్నారు
జులై 21 నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు క్లేములను అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు

అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల జాబితా చివరి ప్రచురణ జరుగుతుందన్నారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో బూతు స్థాయి ఏజెంట్ల పాత్ర చాలా కీలకమన్నారు
జిల్లాలోని మొత్తం 1769 పోలింగ్ కేంద్రాలకు అన్ని రాజకీయ పార్టీలు బూతు స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాల్సి ఉందన్నారు
బూత్ సాయి ఏజెంట్లు నియమించకపోతే ఆ పార్టీకి భవిష్యత్తులో ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు చెప్పే అవకాశం కోల్పోతారన్నారు

ఇప్పటివరకు 1769 పోలింగ్ కేంద్రాలకు గాను తెలుగుదేశం పార్టీ 1710, బిఎల్ఎ లను, వైఎస్ఆర్సిపి 1233 మందిని, జనసేన 267 మందినీ, బిజెపి 21 మంది బిఎల్ఎ లను నియమించిందన్నారు
భారత కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, బీఎస్పీ ఒక్క బిఎల్ఎ ను కూడా నియమించలేదన్నారు
గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాలకు వైఎస్ఆర్సిపి ఇంకా ఒకరిని కూడా నియమించలేదన్నారు.

ఓటర్ నమోదు పత్రాలు తీసుకున్నాక ప్రజలు వాటిని భర్తీ చేసి తిరిగి బిఎల్ఓ లకు అందజేయాలన్నారు. ఎవరైతే ఆ పత్రాలు తిరిగి ఇవ్వరో వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవని స్పష్టం చేశారు. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తు ఉంచుకొని ఓటరు నమోదు పత్రాలు తిరిగి వచ్చేలా కృషి చేయాలన్నారు.

అర్హులైన ఏ ఒక్కరూ ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోరాదని ముఖ్య ఉద్దేశం అన్నారు

ఈ సమావేశంలో తెలుగుదేశం ప్రతినిధులు బిఎంవి దాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్, రాష్ట్ర కార్యదర్శి గజేంద్రరావు, బీఎస్పీ ప్రతినిధి బాలాజీ, సిపిఎం ప్రతినిధి కొడాలి శర్మ, వైసిపి ప్రతినిధి సిలార్ దాదా , కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *