-మోదీ విధానాలతోనే ధరల పెంపు
-సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ, ప్రజా సంఘాలు చేపడుతున్న ఉద్యమంలో పార్టీ సోషల్ మీడియా క్రియాశీలకంగా నిలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ చంద్రం బిల్డింగ్ నుంచి సోషల్ మీడియా విస్తృత స్థాయి సమావేశం జూమ్ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన రామకృష్ణ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాల అంశాలపై రాజకీయ ఉపన్యాసం చేశారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న అమెరికా రాజ్యాంగ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండట్టారు. ట్రంప్‌కు మోదీ ప్రభుత్వం దాసోహంగా మారిందని, దీంతోనే ధరల పెరుగుదలకు కారణమని విమర్శించారు. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీట్లు, ఓట్లు సాధించుకునేందుకు నానా తంటాలు పడిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని ఆయన విశ్లేషిస్తూ..ప్రధానంగా తమిళనాడు, కేరళలో కీలక మార్పులు జరిగాయని అన్నారు. కేరళలో యÖడీఎఫ్ అధికారం చేపట్టిందని, కేరళలోని పదేళ్ల పరిపాలన అనేక మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఓటర్లు మాత్రం యÖడీఎఫ్‌కు పట్టం కట్టారన్నారు. తమిళనాడులో ఫలితం ఆశ్చర్యకరంగా మారిందన్నారు. సొంతంగా పార్టీ పెట్టిన విజయ్ 108 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయంగా చర్చానీయాంశమైందని తెలిపారు. తమిళనాడు డీఎంకే, అన్నా డీఏంకేలు ఎంతో కాలంగా ప్రత్యర్థులుగా ఉన్నారని తెలిపారు. తమిళనాడులో అనేక చిన్న పార్టీలు ఉన్నాయని, డీఎంకేతోను, అన్నాడీఎంకేతోను కొన్ని పార్టీలు సర్దుబాటు చేసుకున్నాయని వివరించారు. ఒక్క సర్వే సంస్థ మినహా అన్నీ డీఎంకే కూటమే అధికారంలోకి వస్తుందని జోశ్యం చెప్పాయన్నారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీకి చెందిన యÖత్ సామాజిక మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు. ప్రత్యేకంగా ఆ పార్టీకి దళిత, క్రైస్తవ, పేద వర్గాలు నిలిచారని వివరించారు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం కాగా, గవర్నరు కొంచెం ఇబ్బందులకు గురిచేశారన్నారు.డీఎంకే మద్దతో గెలిచిన కాంగ్రెస్ ఆ పార్టీతో చెప్పకుండా విజయ్‌కు మద్దతిచ్చిందన్నారు. మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా అక్కడ రాష్ట్రపతి పరిపాలన లేకుండా సిపిఐ, సిపిఎం, వీసీకే మాట్లాడుకుని, ఆ తర్వాత డీఎంకేతో చర్చించుకుని విజయ్ పార్టీకి మద్దతిచ్చినట్లు గురుతచేశారు. అప్పటికే నాలుగు సార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదన్నారు. సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు తర్వాత గవర్నరు ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిచ్చారని తెలిపారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయ్‌కు అన్నా డీఎంకే సభ్యులూ మద్దతు ఇవ్వడంతో బలం మరింత పెరిగిందన్నారు. మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎసఐఆర్‌తో కేంద్ర ప్రభుత్వం ఓటర్ల తొలగింపునకు కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తమిళనాడులోనే 94 లక్షల ఓట్లు తొలగించారని వివరించారు. దేశ వ్యాప్తంగా చాలా పకడ్భందీగా ఎసఐఆర్‌తో విపక్షాలకు ఓట్లు వేసే వారిని తొలగిస్తున్నారని, ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటున్నారని, గతంలో ఈ తరహా చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అవ్వగా ఎంతో తెలివిగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మÖడు రోజులముందు అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాల్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీ లిమిటేషన్‌తో ముడిపెట్టి బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచేందుకు, దక్షిణాదిలో తగ్గించేందుకే మోదీ యుక్తులు పన్నిందని ధ్వజమెత్తారు. దీనిపై ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించాయంటూ బీజేపీ దుష్ప్రచారానికి ఒడిగట్టిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ సమస్యను పరిష్కరించకపోగా, మరింత పెంచేలా ఉందని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. వారంలోనే రెండు సార్లుగా పెట్రోల్, డీజిల్ పెంచారని, దీని ప్రభావంతో రవాణా చార్జీలు పెరుగుతాయని, తద్వారా నిత్యవసర వస్తువులు పెరగనున్నాయని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అన్ని రకాలా మోదీ ప్రభుత్వం విఫýమైందని, దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్ర, ప్రచార కార్యక్రమానికి పార్టీ జాతీయ సమితి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిందని, సెప్టెంబరు 28వ తేదీన చలో దిల్లీకి పిలుపునిచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ అధికార, ప్రతిపక్షాలు మోదీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మోదీకి చంద్రబాబు, జగన్, పవన్ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు లేవని, మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కోరారు.జగన్ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో 3లక్షల 30వేల కోట్ల అప్పులు చేస్తే, రాష్ట్రం శ్రీలంక అయిపోతుదంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో 2 ఏళ్లలోనే 3 లక్షల 40వేల కోట్ల రూపాయల అప్పు చేశారని, వాటిని సైతం ఎండగట్టాల్సిన అవసరముందని సూచించారు.
Prajavartha Online Telugu News