విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో, ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు, టీడీపీ నాయకులు పీ వీ కాంతారావు మరియు కూటమి నేతలతో కలిసి అందజేశారు.
40 వ డివిజన్, బ్యాంకు సెంటర్ కు చెందిన పీ రాజ్యం 52 హేమోరాయిడ్స్ సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 25 వేల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News