Breaking News

నేటి నుండి హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం

-టూరిజంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలి
-హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యత
-ఏపీలో టూరిజంకు ఉజ్వల భవిష్యత్ ఉంది.
-టెంపుల్ టూరిజమ్, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న చందాన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫి శాఖామాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్ లోని సమావేశమందిరంలో టూరిజం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్ సమావేశంను బుధవారం నిర్వహించారు. ముందుగా హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ను మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖాధికారులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సంరద్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి పర్యాటక శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని మంత్రి తెలిపారు. డెస్టింగ్ వెడ్డింగ్ లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో విదేశీమారక నిల్వల ను కాపాడుకోవచ్చన్నారు. మన రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, వైజాగ్, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంను ఏడాది పాటు నిర్వహించనున్నామన్నారు. దీంతో ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, హోటళ్లు, స్టే హోమ్ లు, రవాణా రంగాల వారికి అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు. పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకంగా మిగిల్చే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు. ఎయిర్ పోర్ట్ టూ ఎయిర్ పోర్ట్ ప్యాకేజీలు కూడా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకంగా ఏపీ నిలస్తుందనటానికి నిదర్శనమే ఈ ఏడాది టూరిజం ప్రోమోషన్ సిటిగా అవార్డు అందుకోనున్నామని, వచ్చే నెల 4న ఈ అవార్డు అందుకోనున్నామని, ఇది గర్వకారణమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఇన్ చార్జి ఎండీ పద్మావతి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, ఈడీ శేషగిరిరావు, స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *