Breaking News

కృష్ణాయపాలెంలో గ్రామసభ నిర్వహించిన APCRDA

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై కృష్ణాయపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్ హాజరయ్యారు.

రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఇటీవల విడుదల చేసిన భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు.

రాజధాని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామాలవారీగా అధికారులతో కూడిన ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం గ్రామాలలో మౌలిక వసతులు, LPS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై పని చేస్తారన్నారు. కృష్ణాయపాలెంలో త్రాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల గురించి గ్రామస్తులు కమిషనర్ వద్ద ప్రస్తావించగా.. రూరల్ వాటర్ సప్లై(RWS) అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అమరావతిలోని నిర్మాణ పనుల కారణంగా సంచరించే భారీ వాహనాలతో దుమ్ము ధూళి వస్తోందని గ్రామస్తులు తెలుపగా..సంబంధిత గుత్తేదారులను సమస్య పరిష్కరించాలని కమిషనర్ గారు ఆదేశాలిచ్చారు.

రాజధాని అమరావతి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషనర్ గారు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో APCRDA ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్(FAC), డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.మధుసూధనరావు, జి. రవీందర్, కె.సుధారాణి, తహసీల్దార్ పి. సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *