Breaking News

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ జి వాన్ ఓవెన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
డిప్యూటీ హై కమిషనర్(బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్) జి వాన్ ఓవెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ & ట్రేడ్ , పార్ట్నర్‌షిప్స్ డైరెక్టర్ చజ్ వాలియా గురువారం ప్రజారాజధాని అమరావతిలో పర్యటించారు. తొలుత వారు అమరావతి సచివాలయంలో మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్‌ ఐఏఎస్, APCRDA కమిషనర్ వి. విజయ రామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ తో భేటీ అయ్యారు.

అమరావతిని సుస్థిరమైన, సమగ్రమైన, ప్రపంచ స్థాయి ప్రజారాజధానిగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, ప్రణాళికను వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ, APCRDA కమిషనర్ వివరించారు. ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.

అనంతరం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు, గ్రావిటీ కెనాల్, క్యాంపు సైటు కార్యాలయాలను తదితర ప్రాంతాలలో వారు పర్యటించారు. APCRDA అధికారులు.. టవర్ల నిర్మాణ పురోగతి, నిర్మాణంలోని విశిష్ట విధానాల గురించి, అలాగే ప్రణాళికాయుతంగా, అమరావతిలో అనుసరిస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి వివరించారు. అనంతరం రాయపూడిలోని APCRDA కార్యాలయంలో అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ఎండీ SVR శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి AGICL ఎండీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ వివరించారు. అమరావతిలో అభివృద్ధి చేస్తున్న రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలు, విద్యా, వైద్య, పర్యాటక తదితర రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇప్పటికే అమరావతిలో ప్రముఖ విద్యా, వైద్య సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *