విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో వినియోగదారుల కోసం “చేతక్ ఎలక్ట్రిక్ షోరూం” ప్రారంభించబడింది. విజయవాడ నగర ప్రజలకు అత్యంత ఆధునికమైన, పర్యావరణహిత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మరియు అత్యాధునిక సేవలను అందించడానికి ఈ షోరూం అందుబాటులో వుంది. గురువారం వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడలోని సింగ్‌నగర్, నందమూరి నగర్, పి.ఎ.టి కాలనీ ప్రాంతంలో “చేతక్ ఎలక్ట్రిక్ షోరూం”ను ముఖ్య అతిథిగా విచ్చేసిన నీరజ్ శర్మ (సర్కిల్ హెడ్, చేతక్ సౌత్ రీజియన్) ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా రవితేజ (సేల్స్ ఎఎసఎం`ఎపి) మరియు సుధీర్ (సర్వీస్ ఎఎసఎం`ఎపి) పాల్గొనగా వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిశోర్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేవ్, బిజినెస్ హెడ్ కె.వి రామారావు, మరియు జనరల్ మేనేజర్ మిస్టర్ ధనేకుల సుధాకర్ల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ… విజయవాడ ప్రజలకు మెరుగైన, పర్యావరణ అనుకూలమైన హరిత రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంలో వరుణ్ మోటార్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కొనుగోలుదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News