Breaking News

తిరుపతి జిల్లాలో యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 నిర్వహణ

-పరీక్ష నిర్వహణను పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐఏఎస్
-తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఎస్ పి లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం తిరుపతి జిల్లా కేంద్రం లో నిర్వహించిన యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 ను జిల్లా పరిశీలకులు శేషగిరి రావు, ఐ ఏ ఎస్., పరిశీలించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు – 2026 సందర్భంగా ఆదివారం తిరుపతి లోని శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల, ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షల కోసం తీసుకున్న పకడ్బందీ చర్యలు, సదుపాయాల కల్పనపై జిల్లా కలెక్టర్ ఆరా తీసి సజావుగా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ నరసింహులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించారు. ఈ పరీక్షలకు ఉదయం 64.01 పర్సెంట్, సాయంత్రం 63.11 పర్సెంట్ అభ్యర్థులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *