మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ గోవధ నిషేధంపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోవధ నిషేధము జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరం అన్నారు. గోవదకు పాల్పడిన అందుకు సహాయపడిన వారు కూడా చట్టరీత్యా శిక్షార్హులేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రజలందరూ చట్టాన్ని గౌరవించి అనుసరించాలని ఎవరైన ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డిఆర్ఓ చంద్రశేఖర రావు, మీకోసం నోడల్ అధికారి పోతురాజు, డిఎస్పి శ్రీనివాసరావు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News