Breaking News

పారిశుధ్య పనులు, అభివృద్ధి పనుల తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రతేక పర్యవేక్షణ చేయలాని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 2వ డివిజన్ లలోని మణిపురం బ్రిడ్జ్, సీతా నగరం మరియు నగరంలోని ప్రధాన రహదారుల్లో అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మణిపురం బ్రిడ్జ్ వద్ద 15వ ఆర్ధిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన సైడు కాలువ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ, అభివృద్ధి పనులు నిర్వహించడానికి ముందే మార్కింగ్ ని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి చేయాలని, తద్వారా పనుల్లో సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. అలాగే డ్రైన్ నిర్మాణానికి కరెంట్ పోల్స్ అడ్డుగా ఉంటె వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి, కరెంట్ పోల్స్ షిఫ్ట్ చేసిన తరువాత మాత్రమె పనులు ప్రారంభించాలన్నారు. అలాగే అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏమినిటి కార్యదర్శులు అభివృద్ధి పనులను క్షేత్ర స్తాయిలో పర్యవేక్షించి, పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సీతానగర్ నందు పర్యటించి సెక్రటరీలు నిర్వహిస్తున్న వివిధ సర్వేల వివరాలు మరియు వాటి పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలో జరుగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేసి, నూరు శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ జరగాలని, ప్రజల వద్ద నుండివ్యర్ధాలను తడి పొడి వ్యర్ధాలుగా విభజించి సేకరించాలన్నారు. అలాగే ప్రజలు గృహాల వద్దే హోం కంపోస్ట్ తయారు చేసేలా వారికి అవగాహన కలిగించాలని ఆదేశించారు. అంతేకాక నగరంలోని ప్రధాన రహదారుల్లో పర్యటించి, పలు ప్రాంతాలలో పోస్టర్లు మరియు బ్యానర్లు ఉండుట గమనించి, వెంటనే వాటిని తొలగించి, బాధ్యులైన వారి పై అపరాధరుసుము విధించాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది, ప్రజారోగ్యాదికారులు సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *