-ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కూటమి నేతలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తుంది. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్,44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి, సెక్టార్- 3 ఎస్ఐ పీ శివ మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కూటమి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లం రాజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదిగొండ శివ, టీడీపీ నేత గూడెల ఉమామహేశ్వరరావు , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News