విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 51 వ డివిజన్ కొత్తపేట కు చెందిన వై ఉదయ్ కుమార్( 32) రోడ్డు ప్రమాదం లో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5 లక్షలను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు..
అదేవిధంగా 49 వ డివిజన్ జోడు బొమ్మల ప్రాంతానికి చెందిన డొంకాన గోపాలరావు (53) రోడ్డు ప్రమాదంలో గాయపడి మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 72 వేల ఎల్ ఓ సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలను అందజేయడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు బుల్లబ్బాయి ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు,బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు దుర్బేసుల హుస్సేన్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, జనసేన సిటీ సెక్రటరీ శనివారపు శివ, 34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రుద్రపాటి వెంకటేష్, 42 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి కృష్ణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News