-దశాబ్దాల కాలం నుంచి ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యపై ఎంపీ చిన్ని ప్రత్యేక చొరవ
-500 కార్మిక కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి
-ఏపీఐఐసీ కాలనీవాసుల సమస్యపై సిఎస్ సాయి ప్రసాద్ తో ప్రత్యేక సమావేశం
-సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మంత్రి అనగానీ సత్య ప్రసాద్ ఎమ్మెల్యే గద్దె రామ్మ హన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ కాలనీ వాసుల రిజిస్ట్రేషన్ సమస్యపై సి ఎస్ సాయి ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీ వాసుల సమస్య పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఏపీఐఐసీ కాలనీ లో ఆటోనగర్ కార్మికుల కోసం గతంలో నిర్మాణం చేసిన క్వార్టర్స్ కేవలం ప్లింత్ ఏరియా మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగిందని ముందు వెనక ఉన్న స్థలాన్ని ఖాళీగానే వదిలేశారని ప్రభుత్వాలు మారిన ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా అలాగే విడిచి పెట్టారని తెలిపారు.
ఏపీఐఐసీ కాలనీవాసులు చాలా కాలం నుండి చాలీచాలని నివాసాలతో ఇబ్బంది పడుతున్నారని ఈ రిజిస్ట్రేషన్ జరిగితే ఈడబ్ల్యూఎస్ కు ఎమ్ ఐ జి లకు న్యాయం జరుగుతుందని చిన్ని తెలిపారు. గత టిడిపి సమయంలోనే ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చిందని గడచిన వైసిపి హయాంలో దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించారని అన్నారు. మళ్లీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
ఈరోజు జరిగిన సమావేశంలో సి ఎస్ సాయి ప్రసాద్ సానుకూలంగా స్పందించి రీ సర్వే చేయించాలని సర్వే ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అంతా పూర్తయ్యాక త్వరలోనే ఈ విషయం క్యాబినెట్లో పెట్టాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎంపీ తెలియజేశారు.
దశాబ్దాల కాలం నుంచి ఎదురుచూసిన సమస్య పట్ల కూటమి ప్రభుత్వం చూపిన చొరవ పై కాలనీవాసులు ఆనందోత్సహలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సి ఎస్ సాయి ప్రసాద్ ఎంపీ చిన్ని మంత్రి అనగానీ సత్య ప్రసాద్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News