Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ
(లెటర్ ఆఫ్ క్రెడిట్) ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 52 వ డివిజన్ మల్లికార్జున పేటకు చెందిన పీ వరలక్ష్మి ( 52) అనారోగ్యం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) ఎల్ ఓ సీ కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 3 లక్షల 15 వేల ఎల్ ఓ సీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీను అందజేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, గంజి పవన్, ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, దాడి మురళి కృష్ణ,ఈగల సాంబశివరావు, నక్కెట్ల రాజా, శ్యామ్ మారేపల్లి, మలపరెడ్డి అప్పారావు, గాడు గణేష్, సీ హెచ్ రామ నాయుడు, గూడూరు కొండయ్య, గడ్డిపాటి కిరణ్ సుజనా మిత్రా దొడ్ల రాజా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *