Breaking News

పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పట్టణంలో సుందరమైన, సురక్షితమైన కూడళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. నగరంలోని రహదారులు, కూడళ్లను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిఎంసి విభాగాధిపతులు, అధికారులతో సమీక్షించారు. తొలుత ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కి నగర కమిషనర్ హిందూ కాలేజీ కూడలి, బి.ఆర్ నాయుడు, కలెక్టర్ కార్యాలయం కూడలి, మూడు బొమ్మల జంక్షన్, చుట్టుగుంట జంక్షన్, మెడికల్ క్లబ్ జంక్షన్ సుందరీకరణ., వి.ఐ.పి రహదారిలో ల్యాండ్ స్కాపింగ్ తదితర అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో పక్కాగా నిర్దేశిత నిబంధనలు పాటించాలని ఆదేశించారు. రహదారి నిర్మాణం జరిగిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల వరకు వాటిని తవ్వరాదని స్పష్టం చేశారు. కేబుల్ లు వంటివి వేయుటకు కొన్ని సంస్థలకు అవసరం ఉంటుందని, ఆయా సంస్థలతో ముందుగానే సమావేశం నిర్వహించి తెలియజేయాలని, వారి అవసరాలు సమర్పించాలని సూచించారు. నగర పాలక సంస్థ చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పైప్ లైన్ లు వేయడం, సి.సి కెమెరాలు ఏర్పాటు వంటి వాటిని కూడా చేపట్టరాదని, ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలోని జంక్షన్ల వద్ద ఎక్కడా తీగలు వేలాడుతూ కనిపించరాదని అన్నారు.

జంక్షన్ ల వద్ద టేబుల్ టాప్ లు పక్కగా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు అనువుగా జంక్షన్ లు ఉండాలని, హై మాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయు స్థలం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయు స్థలం శాస్త్రీయంగా ఉండాలని ఆదేశించారు. జంక్షన్ వద్ద ఫౌంటైన్ లు ఏర్పాటు చేయాలని వాటికి కావలసిన సామర్థ్యం గల పరికరాలు పెట్టాలని, ప్రతి చోటా ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. జంక్షన్ ల వద్ద సూచిక బోర్డులు పక్కాగా ఉండాలని, వాటికి వెళ్ళే మార్గాలలో కాబుల్ స్టోన్ పెట్టాలని ఆదేశించారు. జంక్షన్ లు, మీడియన్ లు, రహదారులలో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాలు సైతం శాస్త్రీయంగా ఉండాలని అన్నారు. వీధుల నుండి రహదారులకు అనుసంధానం అయ్యే రహదారులకు కూడా టేబుల్ టాప్ లు పక్కాగా ఉండాలని చెప్పారు. గ్రీన్ బెల్ట్ లు ఏర్పాటు చేయాలని, నీడను ఇచ్చే చెట్లను పెట్టాలని తెలిపారు. ఫూట్ పాత్ లు ఏర్పాటు పట్టణం మొత్తం ఒకే విధంగా ఉండాలని అన్నారు.
అనంతరం త్రాగునీటి సరఫరా, పారిశుధ్యంపై సమీక్షించి, నగరంలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కావడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా పైప్ లైన్ ఆడిట్ చేసి, వెంటనే అంచనాలు సిద్దం చేసి అనుమతులు మనుజూరు చేయాలన్నారు. త్రాగునీటి కలుషితం జరిగితే పూర్తి భాధ్యత ఇంజినీరింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. అలాగే నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, ప్రత్యేకంగా అండర్ పాస్ ల వద్ద పోస్టర్స్ అంటించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగంగా చేపట్టాలన్నారు. దోమల ఉధృతి తగ్గేలా యాంటీ లార్వా యాక్టివిటిలు, నీటి నిల్వ ప్రాంతాల్లో గంబూషియా చేపలను విస్తృతంగా వదలాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *