గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం లోపే నగరంలోని అన్ని అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు నూరు శాతం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాలువల్లో సిల్ట్ తొలగింపు పూర్తైన అనంతరం వెంటనే సదరు ప్రాంతం నుండి సిల్ట్ ను తొలగించాలని అధికారులను ఆదేశించాలన్నారు. సిల్ట్ తొలగింపు పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు అదనపు వర్క్స్ ను ఏర్పాటు చేసుకొని పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో కార్యదర్శులు నూరు శాతం తప్పనిసరిగా శ్యాంపిల్స్ సేకరించాలని, ఏఈలు కూడా త్రాగునీటి సరఫరా సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా త్రాగునీటి కలుషితం కాకుండా చూడాలని, ముఖ్యంగా టైలేండ్ ప్రాంతాలలో నిత్యం పర్యవేక్షణ చేస్తూ, త్రాగునీటి శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. అంతేకాక వాటర్ మీటర్ రీడింగ్ పక్కాగా జరిగేలా ఏ.ఈ పర్యవేక్షణ చేయాలని, మీటర్ రీడర్లు సరిగా రీడింగ్ తీస్తున్నదీ లేనిదీ ఏ.ఈ లు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు జూన్ 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యంగా డ్రైన్ నిర్మాణ పనులు వర్షాలు రాకముందే పూర్తి చేయాలని, అలాగే పనులు పూర్తైన అనంతరం వాటికిసంబంధించిన బిల్లులను వెంటనే నిధి పోర్టల్ లో సబ్మిట్ చేయాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈలు సుందరరామిరెడ్డి, వేణు, విష్ణు, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News