-సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ప్రజలు తమ ఐడీని ఎన్యూమరేటర్లకు అందించాలని విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర బుధవారం సెన్సస్–2027 కార్యక్రమంలో భాగంగా గత నెలలో తాను పూర్తి చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలను ఉపయోగించి వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సిటీ సెన్సస్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ ఏ.రవీంద్ర రావు సమక్షంలో నమోదు ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్న ప్రజలు తమకు వచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీని ఎన్యూమరేటర్లకు అందజేసి సెన్సస్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనివల్ల సమాచారం సులభంగా ధృవీకరణకు రావడంతో పాటు గణన ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. సెన్సస్–2027 దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా సహకరించాలని సూచించారు. ప్రజలు సరైన వివరాలను అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సిటీ సెన్సస్ ఆఫీసర్ మరియు ఆదనపు కమిషనర్ ఏ. రవీంద్ర రావు, సెన్సెస్ సూపర్వైజర్ మరియు టీపీవో గిరి, ఎన్యూమరేషన్ లీల ప్రశాంత్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News