-ప్రతి బాధ్యత తనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పింది
-అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు తనకు కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగానని, సమాచార శాఖలో నిర్వర్తించిన ప్రతి బాధ్యత తనకు కొత్త అనుభవాన్ని, విలువైన పాఠాలను నేర్పిందని అదనపు సంచాలకులు (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్గా సేవలందిస్తున్న పి.కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జి) గా పదోన్నతి కల్పించిన నేపధ్యంలో బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అనుభవమే నాకు పాఠం:
ఈ సందర్భంగా అదనపు సంచాలకులు (Additional Director) (ఇంచార్జి) గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ… సమాచార శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేయడం నాకు ఎంతో విలువైన అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి బాధ్యత నాకు కొత్త పాఠాన్ని నేర్పిందన్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల సహకారం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులందరినీ ఒక కుటుంబంగా భావించి, పరస్పర సమన్వయంతో శాఖాభివృద్ధికి పాటుపడుతానని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాహితమే లక్ష్యం:
ప్రభుత్వ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ బాధ్యతను మరింత మెరుగ్గా, అంకితభావంతో నిర్వహిస్తానని పి. కిరణ్ కుమార్ వెల్లడించారు.
అభినందనలు తెలిపిన అధికారులు:
అభినంధనలు తెలియజేసినవారిలో జాయింట్ డైరెక్టర్లు ఐ. సూర్యచంద్రరావు, సీఐఈ ఓ. మధుసూధన, ఆర్ఐఈ డాక్టర్ టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేశ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏఎస్ వీరభద్రరావు, కే. నారాయణ రెడ్డి, పి. రాజశేఖర్, డాక్టర్ కె. తిరుపాలయ్య, ఎస్వీ మోహన్ రావు, గణాంక విభాగం నుంచి నాగరాజు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News