Breaking News

రంపచోడవరం అడవుల్లో ఉచ్చులు, ట్రాప్‌లను నిర్వీర్యం చేసిన అటవీ సిబ్బందికి అభినందనలు

-వన్యప్రాణి సంరక్షణలో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది పని తీరు ప్రశంసనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘హనుమాన్ ఫౌండేషన్ స్ఫూర్తితో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇటీవల రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు ఏర్పాటు చేసిన ఉచ్చులు, ట్రాప్‌లను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి వన్యప్రాణుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును తొలగించారు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందిని ప్రశంసించారు. మూడు రోజుల పాటు కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్ లు, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న కరెంటు తీగలు తొలగించిన మిగిలిన సిబ్బందికి స్ఫూర్తినిస్తుంది అన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ పట్ల సిబ్బంది నిరంతర అప్రమత్తత, అంకితభావం ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించడం కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్‌తో సమానమనీ, ఈ దిశగా అటవీ సిబ్బంది ఎంతో నిబద్దతతో ముందుకు వెళ్ళాలి అన్నారు. రంపచోడవరం సిబ్బంది చేసిన ఈ ఆపరేషన్ ను ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను తరతరాలుగా సంప్రదాయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల ప్రాణాలతో ఆటలాడుకునే వ్యక్తుల పట్ల కూడా గిరిపుత్రులు అప్రమత్తతతో వ్యవహరించి అటవీ శాఖకు సహకరించాలి. ఎక్కడైనా ఉచ్చులు, ట్రాప్‌లు, అనధికారికంగా ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు గుర్తిస్తే తక్షణమే ఆ సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. వన్యప్రాణుల వేట జీవ వైవిధ్యాన్ని, అటవీ పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. జీవ వైవిధ్యానికి నిలయమైన మన అటవీ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దిశగా ప్రజలంతా అటవీ శాఖకు సహకరించాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా అటవీ శాఖ సిబ్బంది స్థానికులతో స్నేహపూర్వకంగా మెలగాలి” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *