-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్
-ఏపీలో జీరో వెకెన్సీ ద్వారా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం!
-డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు
-విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యశాలలో హెచ్ఆర్ పాలసీపై సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరుల వినియోగ విధానం (పాలసీ) అమలును కనీసం 30 ఏళ్లకోకసారి పునస్సమీక్షించి, ఆనాటి అవసరాలకు తగ్గట్లు మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మానవ వనరుల విధానం (పాలసీ)లో పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించడంలో పలు సందర్భాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ హయాంలో మానవ వనరుల కొరత తీవ్రంగా కనిపించిందని తెలిపారు. అలాగే దశాబ్దాల కిందట తీవ్రంగా ఉన్న కుష్టు వంటి రోగాల నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రస్తుతం కుష్ఠు ప్రభావంలేదని, కానీ అప్పట్లో సృష్టించిన కేడర్లు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు.
7 రాష్ట్రాల్లోని హెచ్ఆర్ పాలసీ అమలుపై కేంద్రం పునస్సమీక్ష
కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మానవ వనరుల వినియోగ (హెచ్ఐర్ పాలసీ) విధానం అమలు తీరును పునస్సమీక్షించాలని చేయాలని నిర్ణయించింది. వైద్య సేవలు, జాతీయ కార్యక్రమాల అమలుకు తగ్గట్లు వైద్య సేవలు ఎలా? వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి? వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది అవసరాలకు తగ్గట్లు ఉన్నారా? కొరత ఉంటే ఏ స్థాయిలో ఉందన్న వివరాలపై దేశంలోని కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశ్శా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లోని హెచ్.ఆర్. పాలసీ అమలును సమీక్షిస్తోంది. ఇందుకు
ప్రపoచ బ్యాంక్ నుంచి టెక్నికల్ సపోర్టు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో హెచ్ఆర్ పాలసీ అమలుగురించి విజయవాడలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యశాల ద్వారా కేంద్ర ప్రత్యేక బృందం తెలుసుకుంది. అధికారులతో చర్చించింది. తుదిగా ప్రస్తుత హెచ్ఐర్ పాలసీని హేతుబద్ధీకరించి, ఆయా రాష్ట్రా ల వారు మార్పులు చేసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తుంది.
విధుల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి
కార్యశాలలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ, HR పాలసీ పటిష్టంగా ఉండేందుకు గౌతమ బుద్ధ పేర్కొన్న ‘అష్టాంగ మార్గం’ను ఆరోగ్య రంగంలో అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర కార్యకలాపాలు మానవ జోక్యం లేకుండా ఆన్లైన్లో జరిగిపోవాలని, ప్రస్తుత విధానంలో కొన్ని పోస్టులకు కేటాయించిన విధుల్లో కొన్ని ఒకేలా ఉన్నందున సవరించాలని పేర్కొన్నారు. Job చార్ట్ , హెచ్ ఆర్ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై పలు సూచనలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు మాట్లాడుతూ విధుల్లో చేరిన వారు నిత్య విద్యార్థిగా విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటుండాలన్నారు. వైద్యులు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని, అప్పుడే రోగుల నుంచి స్పందన కనిపిస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేరిన వారు ఆరోగ్య సంరక్షణలో ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోనికి వస్తున్నప్పటికీ విధుల నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో టీనేజీ వివాహాలు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే జీరో వెకెన్సీ విధానంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ కార్యశాలలో
డిఎంఈ రఘునందన్, వైద్య ఆరోగ్య శాఖకు చెంది న ప్రధాన హెచ్సిడీ కార్యాలయాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందంలో ప్రపంచ బ్యాంక్ సీనియర్ కన్సల్టెంట్ గణేశ్, ఎయిమ్స్ భువనేశ్వర్ డాక్టర్ వినోద్పత్రో, ఐఏఎం అహ్మదాబాద్ నుంచి పరిశోధకులు ప్రశాంత్ రోహిత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News