Breaking News

అడిష‌నల్ డైరెక్ట‌ర్ పి.కిర‌ణ్ కుమార్‌కు ఘ‌న వీడ్కోలు

– సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు
– స‌మాచార శాఖ‌కు విశిష్ట సేవ‌లు అందించిన అధికారి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ డైరెక్ట‌రేట్‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ (ఏడీ)గా విధులు నిర్వర్తించి ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న పి.కిర‌ణ్ కుమార్‌ను సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున మేనేజ‌ర్ ఎం.భాస్క‌ర్ నారాయ‌ణ, సిబ్బంది శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పి.కిర‌ణ్ కుమార్ స‌మాచార శాఖ‌లో ప‌లు కీల‌క బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ విశిష్ట సేవ‌లు అందించార‌ని కొనియాడారు. మీడియా, ప్ర‌జా సంబంధాల రంగంలో ఆయ‌న అనుభ‌వం, సేవా దృక్ప‌థం యువ అధికారులకు ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పి.కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ, త‌న సేవా కాలంలో సహ‌క‌రించిన అధికారులు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
కార్య‌క్ర‌మంలో సీఆర్ మీడియా అకాడ‌మీ జూనియ‌ర్ అసిస్టెంట్ ల‌వ‌రాజు, పీఎస్ శ్రీనివాస జీవ‌న్‌, సిబ్బంది ఆదిత్య‌, జె.రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *