తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మరియు ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి సంబంధించి గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని VC హాల్‌లో సమావేశం నిర్వహించబడింది. ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్, వెలగపూడి వారి మెమో నెం. 2,610/Elecs.B/A1/2026-5, తేది 18-05-2026లో జారీ చేసిన ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన మరియు పారదర్శకమైన ఓటరు జాబితాల నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ద్వారా ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదు కావడం, తప్పులు సవరించబడడం మరియు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందడం సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంతో ముఖ్యమని, అధికారులు మరియు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం ఉండడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు అందిస్తూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News