Breaking News

56 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 56 మందికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు రూ 29 లక్షల 70 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమలో పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలనలో పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పార్టీలకతీతంగా సేవలనందిస్తున్నామన్నారు. పశ్చిమ అభివృద్ధికి మరింత మెరుగైన పాలనకు
ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా కోరారు.

ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు,టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, యేదుపాటి రామయ్య,మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మైలవరపు దుర్గారావు, మరుపిళ్ళ రాజేష్, గుడివాడ నరేంద్ర రాఘవ, సయ్యద్ అబ్దుల్ ఖాదర్, పత్తి నాగేశ్వరరావు,అలుగుండ్ల సుబ్బారెడ్డి, జనసేన నేతలు తిరుపతి సురేష్, తిరుపతి అనూష, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్,బీజేపీ నేతలు దుర్బేసుల హుస్సేన్ పోతిన భేసు కంటేశ్వరుడు,పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, పిట్టల గోవిందు పైలా సురేష్, కందుల సుబ్రమణ్యేశ్వరరావు , రుద్రపాటి వెంకటేష్, పగడాల కృష్ణ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, షేక్ మధు మస్తాన్, మంగళపురి మహేష్, గడ్డీపాటి కిరణ్,ఏ ఈ జాస్మీన్, అమెనిటీస్ సెక్రటరీ గీతిక, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *