విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ ను సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి అందజేశారు. 55 వ డివిజన్ వించిపేటకు చెందిన దేవకుమార్ ( 68) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ వో సి కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 90 వేల ఎల్ ఓ సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మరుపిళ్ల రాజేష్ , టీడీపీ నేతలు నాగోతి రామారావు, సయ్యద్ కరిముల్లా, జనసేన నేత ఏలూరు సాయి శరత్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి , టీడీపీ మహిళా నేత బంకా నాగమణి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News