-రెవెన్యూ వసూళ్లపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, వాటర్ మీటర్ ఛార్జీల వసూళ్ల పురోగతిని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ( వీడియో కాన్ఫరెన్స్ ద్వారా), డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సమీక్షించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి ప్రస్తుత వసూళ్ల పరిస్థితిని అధికారులు కమిషనర్‌కు వివరించారు. వసూళ్లలో మరింత పురోగతి సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కమిషనర్ సూచించారు. పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బకాయిల వివరాలను పరిశీలించి, వాటి వసూళ్ల కోసం సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు కేసుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ వ్యవహారాల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అంశంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఏ యు బి శర్మ, హెలెన్, డి యస్ యస్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News