Breaking News

సిద్ధార్థ విద్యార్థి వినోద్ కి జేఈఈ ర్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పి.బి. సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి వినోద్ కుమార్ మొగిలి (రోల్ నెం: 266015080) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ 1173 సాధించి, ప్రతిష్టాత్మక ఐఐటీలలో చేరే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన వినోద్ కుమార్ ను ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి
నిమ్మగడ్డ లలితప్రసాద్, అకడమిక్ అడ్వయిజర్ ఎల్.కె. మోహనరావు అభినందించారు. అధ్యాపకులు ఐ. సుబ్బారావు (కెమిస్ట్రీ), ఎం.కోటేశ్వరరావు (ఫిజిక్స్),కె.శ్రీనివాసరావు (మ్యాథ్స్) కూడా ర్యాంకర్ కు అభినందనలు తెలియచేశారు. నాణ్యమైన విద్య, అంకితభావంతో కూడిన మార్గదర్శకత్వం కలగలిసి ఎలాంటి అదనపు ఆర్థికభారం లేకుండా విద్యార్థులు జాతీయస్థాయి విజయాన్ని సాధించడానికి దోహదపడతాయని కార్యదర్శి పి.లక్ష్మణరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *