అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో జూన్ 3న నిర్వహించనున్న 1వ అమరావతి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ టోర్నమెంట్స్–2026 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని ముఖ్య అతిథిగా టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మంత్రి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరచనున్నారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభివృద్ధికి ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
Prajavartha Online Telugu News