Breaking News

మెరుగైన వైద్యం కోసం ఐదుగురు బాధితులకు రూ 18 లక్షల 57 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ
(లెటర్ ఆఫ్ క్రెడిట్) లను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు ,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు.

48వ డివిజన్ ,వాగు సెంటర్ కు చెందిన ఈ సింహాచలం ( 70) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎల్ ఓ సీ కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5 లక్షల ఎల్ ఓ సీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీను అందజేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు. 48వ డివిజన్, చిట్టినగర్ కు చెందిన బెవర అప్పల నరసమ్మ (66) గర్భాశయ సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల ఎల్ ఓ సీ ను అందజేశారు. 48 వ డివిజన్ చిట్టినగర్ కు చెందిన ఆనంద్ (38) రోడ్డు ప్రమాదంలో గాయపడి మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ ఎల్ ఓ సీ ను బాధితుడికి అందజేశారు

46 వ డివిజన్, సిండికేట్ బ్యాంక్ కాలనీ కు చెందిన కొమ్మోజు వరలక్ష్మి ( 44) గర్భాశయ సమస్య తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 98 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. అదే విధంగా 38 వ డివిజన్ కుమ్మరిపాలేం సెంటర్ కు చెందిన పీ జరీనా (22) మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 7 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు.

కూటమి నేతలు వేవిన నాగరాజు, దేవిన హరి ప్రసాద్, ఏలూరు సాయి శరత్, దుక్కా దుర్గారావు, జి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *