Breaking News

డిఎస్సీ 2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం రాష్ట్ర హోంమంత్రి అనిత

-చిత్తశుద్ధి, ప్రజలకు జవాబుదారిగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది
-డిఎస్సీపై ఎడాది పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు రాద్ధాంతం చేయడం హస్యాస్పదం
-స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పబ్లిక్ డోమైన్ లో ఉంచాము
-అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డిఎస్సీ 2025ను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట్ర హోం శాఖామాత్యులు వంగలపూడి అనిత అన్నారు.ఏపీ సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు జవాబుదారిగా పని చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం కనీసం ఒక్క డిఎస్సీ ని కూడా నిర్వహించ లేకపోయిందని ఎన్నికలకు 60 రోజుల ముందు డిఎస్సీ నోటిఫికేషన్ కేవలం 6100 పోస్ట్ లతో వేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.కాని మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ నిర్వహించారని తెలిపారు.8 సంవత్సరాల నిరీక్షణ అనంతరం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తే ఇప్పుడు దాదాపు 8, 9 నెలల తరువాత రాద్ధాంతం చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో డిఎస్సీలు సమర్థవంతంగా నిర్వహించారని, ఆయా డిఎస్సీల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారని మంత్రి అనిత గుర్తు చేశారు.వాస్తవంగా రాష్ట్రంలో సుమారు 3.11లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే వారిలో 60 శాతం మంది ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే ఉద్యోగాలు సాధించారన్నది తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. అంతెందుకు తాను సైతం 2001లో డిఎస్సీ ద్వారానే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించానని 12 సంవత్సరాల సర్వీసు తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు.అందుకనే నా అనుభవంతో చెబుతున్నాను డిఎస్సీ నోటిఫికేషన్, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్స్ ఎలా జరుగుతాయో నాకు తెలుసని స్పష్టం చేశారు.ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా డిఎస్సీ నిర్వహణ జరుగుతుందన్నారు.డిఎస్సీ 2025 నిర్వహణకు ప్రభుత్వం 240కి పైగా కోర్టు కేసులు దాటుకుని సుమారు 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు.అంతేకాకుండా 15వేలకు పైగా టీచర్ పోస్ట్ లు అతి గౌరవంగా వారికి అందించడం జరిగిందన్నారు.
ఒకసారి అలోచిస్తే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి అభ్యర్థులు తమ కుటుంబాలకు దూరంగా ఎక్కడో సూదూర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుని మరీ సిద్ధం అవుతారన్నది వాస్తవమని అన్నారు.నెలలు సంవత్సరాల తరబడి శిక్షణ పొంది పరీక్ష వ్రాసి ఎంపికై సగౌవరంగా ఉద్యోగంలో చేరతారన్నది నిజమని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా డిఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్ లు అందించి దిశానిర్ధేశం చేశారని గుర్తు చేశారు.ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న డిఎస్సీ పై అవాకులు చవాకులు పేలడం దారుణమన్నారు.నిబంధనల మేరకు డిఎస్సీ నిర్వహించి మూడు స్థాయిల్లో గ్రీవెన్స్ నిర్వహించి, గ్రీవెన్స్ లో 34 వేలకు పైగా గ్రీవెన్స్ వస్తే వాటి అన్నింటిని పరిష్కరించి ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా డిఎస్సీ నిర్వహించామన్నారు.అత్యంత పకడ్బందీగా టీసీఎస్ ద్వారా దాదాపు 43వేల ప్రశ్నలను సిద్ధం చేసి మరీ డిఎస్సి నిర్వహించామన్నారు.
స్పోర్ట్స్ కోటా కింద 3 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని మంత్రి అనిత తెలిపారు. 3 శాతం రిజర్వేషన్ అంటే 421 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించారని అయితే కేవలం అర్హులు 382 మందిని మాత్రమే భర్తీ చేయడం జరిగిందన్నారు.ఎంపికైన వారి సర్టిఫికెట్లను పబ్లిక్ డోమైన్ లో కూడా పెట్టడం జరిగిందని అవసరమైన వారు వాటిని పరిశీలించుకోవచ్చని అన్నారు.స్పోర్ట్స్ కోటా అయినా విద్యార్హతలు మాత్రం తప్పని సరి అని అవి కూడా 15 మంది సభ్యుల బృందం పరిశీలించి మరీ ఎంపిక చేయడం జరిగిందన్నారు.స్పోర్ట్స్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల క్రీడా సర్టిఫికెట్లను ఫెడరేషన్ లు,అసోసియేషన్ లకు పంపించి వెరిఫై చేసి ఆ తర్వాత హరిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. బ్రిడ్జి స్పోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు లోబడే ఆథరైజ్డ్ గా తీసుకోవడం జరిగిందన్నారు.బ్రిడ్జి స్పోర్ట్స్ ను ఏషియన్ గేమ్స్ 2018, 2022లో కూడా నిర్వహించారన్నారు. ఇందులో ఇండియా కు కాంస్య పతకం సైతం వచ్చిందన్నారు.గత ప్రభుత్వం గ్రూప్-1 ను అనేక అవకతవకలతో నిర్వహించి అభాసుపాలయిందని అటువంటి సంఘటనలు చంద్రబాబు పాలనలో ఒక్క సంఘటనైనా చూపాలని మంత్రి అనిత డిమాండు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *