అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్బీ) నిర్వహించిన వాక్-ఇన్ రిక్రూట్మెంట్ విజయవంతమైంది. డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో నోటిఫై చేసిన 8 పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డీవీఎల్ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం మొత్తం 79 మంది అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఎంపిక ప్రక్రియ అనంతరం అన్ని ఖాళీలను భర్తీ చేశామని ఏపీఎంఎస్ ఆర్ బి మెంబర్ సెక్రటరీ తెలిపారు
Tags amaravathi
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News