Breaking News

ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కష్టాల్లో ఉన్నవారికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలుస్తుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, 44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు దుర్బేసుల హుస్సేన్, డాక్టర్ హనుమంతరావు, పోలవరపు దుర్గారావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు

ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, నూతన ఇంటికొరకు దరఖాస్తులు, తాగునీటి ఇబ్బందులు ,వైద్యం సాయం తదితర అంశాలపై వినతులు అందాయని కూటమి నేతలు పేర్కొన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
బీజేపీ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్
బీజేపీ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
బొడ్డుపల్లి శ్రీనివాసరావు
పశ్చిమ నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు కోరారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *