-2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైంది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్ సభ స్థానాలను త్యాగం చేసింది. లోక్ సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కింది
Prajavartha Online Telugu News