విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని భవానిపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.
Prajavartha Online Telugu News